Jun 22 2021 @ 09:11AM

ష‌ర్టుకు ముడేస్తే దాన్ని ఫ్యాష‌న్‌గా మార్చేశారు: అమితాబ్‌

బాలీవుడ్ దిగ్గ‌జం అమితాబ్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, త‌ర‌చూ త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తుంటారు. ఈసారి బిగ్ బీ త‌న పాత సినిమాకు సంబంధించిన ఒక ఆస‌క్తిక‌ర విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు. అంద‌రూ ఫ్యాష‌న్‌గా భావించిన త‌న ఒక స్టిల్ వెనుక‌నున్న ఆస‌క్తిక‌ర ఉదంతాన్ని ఆయ‌న వెల్ల‌డించారు. దీనికి సంబంధించిన ఒక ఫొటో అమితాబ్ షేర్ చేశారు. ఆ ఫొటోలో అమితాబ్ నీలి రంగు ష‌ర్టు, తెలుపు రంగు ప్యాంటు ధరించి క‌నిపిస్తున్నారు. దీనిని ఆరోజుల్లో ఫ్యాష‌న్‌గా భావించి, అమితాబ్ అభిమానులు ఆ త‌ర‌హాలో దుస్తులు వేసుకునేవారు. అయితే ఆరోజు షూటింగ్‌లో జ‌రిగిన గ‌మ్మ‌త్త‌యిన విష‌యాన్ని అమితాబ్ వివ‌రించారు. షూటింగ్‌లో ఆరోజు తాను వేసుకున్న ష‌ర్టు  చాలా పొడవుగా ఉంద‌ని, దీంతో అక్క‌డున్న‌త‌న స్నేహితులు ఆ ష‌ర్టుకు ముడివేయ‌డంతో అలానే షూటింగ్‌లో పాల్గొన్నార‌ని తెలిపారు. దీనిని ఫ్యాష‌న్‌గా భావించి, చాలామంది ఫాలో అయ్యార‌ని అమితాబ్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం అమితాబ్ కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.