Jul 25 2021 @ 03:31AM

బచ్చన్‌ సాబ్‌ వచ్చెన్‌... ప్రభాస్‌ క్లాప్‌ ఇచ్చెన్‌!

ప్రభాస్‌ హీరోగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ గురుపౌర్ణమి సందర్భంగా శనివారం ప్రారంభించారు. ఈ షెడ్యూల్‌ కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రత్యేకంగా సెట్‌ వేశారు. అమితాబ్‌ బచ్చన్‌ మీద చిత్రీకరించిన తొలి షాట్‌కు ప్రభాస్‌ క్లాప్‌ ఇచ్చారు. ‘‘భారతీయ సినిమా గురు అమితాబ్‌పై క్లాప్‌ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా’’ అని ప్రభాస్‌ అన్నారు. ‘‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా సినిమాటిక్‌ మ్యూజికల్‌ వేవ్స్‌ విస్తరింపజేసిన ప్రభాస్‌ ముహూర్తపు షాట్‌కు క్లాప్‌ ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నా’’ అని అమితాబ్‌ అన్నారు. ఈ చిత్రానికి ‘ప్రాజెక్ట్‌ కె’ అనేది వర్కింగ్‌ టైటిల్‌. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్‌ నాయిక.