సింధుకు బీఏసీ క్షమాపణలు

ABN , First Publish Date - 2022-07-06T09:57:48+05:30 IST

గత ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో మ్యాచ్‌ రెఫరీ చేసిన తప్పిదానికి భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ (బీఏసీ) చైర్మన్‌ చి షెన్‌ చెన్‌..

సింధుకు బీఏసీ క్షమాపణలు

న్యూఢిల్లీ: గత ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌పలో మ్యాచ్‌ రెఫరీ చేసిన తప్పిదానికి భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధుకు బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ (బీఏసీ) చైర్మన్‌ చి షెన్‌ చెన్‌ క్షమాపణలు కోరాడు. ఆ టోర్నీలో యమగూచితో సెమీస్‌ మ్యాచ్‌లో సర్వ్‌ చేయడంలో ఆలస్యం చేసిందంటూ సింధుకు అంపైర్‌ ఒక పాయింట్‌ పెనాల్టీ విధించాడు.   ‘అప్ప టికి ఆడడానికి ప్రత్యర్థి సిద్ధంగా లేదు. దీంతో నా సర్వ్‌ ఆలస్యమైంది. అయినా, రెఫరీ ఆమెకు పాయింట్‌ ఇచ్చాడు’ అని ఆ మ్యాచ్‌ ఓడిన తర్వాత సింధు వాపోయింది. తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎ్‌ఫ)కు సింధు లేఖ రాసింది. దీనిపై విచారణ జరిపిన టెక్నికల్‌ కమిటీ.. మానవ తప్పిదంగా తేల్చింది. దీంతో సింధును బీఏసీ క్షమాపణ కోరింది.  

Updated Date - 2022-07-06T09:57:48+05:30 IST