Advertisement
Advertisement
Abn logo
Advertisement

బేబీకార్న్‌ బటర్‌ మసాలా

కావలసినవి: బేబీకార్న్‌ - అరకేజీ, టొమాటోలు - మూడు, కారం - ఒక టీస్పూన్‌, జీలకర్రపొడి - ఒక టీస్పూన్‌, క్రీమ్‌ - పావుకప్పు, వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు - తగినంత, మెంతి ఆకులు - కొద్దిగా, నూనె - సరిపడా, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెలుల్లి రెబ్బలు - నాలుగైదు, జీడిపప్పు - నాలుగైదు పలుకులు.


తయారీ విధానం: ముందుగా ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీడిపప్పు పలుకులను మిక్సీలో వేసి మెత్తటి పేస్టుగా తయారుచేసుకోవాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి వెన్న వేయాలి. కాస్త వేడి అయ్యాక బేబీ కార్న్‌ వేసి పది నిమిషాల పాటు వేగించాలి. కార్న్‌ బాగా వేగిన తరువాత ఒక పాత్రలోకి తీసుకోవాలి. తరువాత అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి మిక్సీలో వేసి పట్టుకున్న ఉల్లిపాయ పేస్టు వేసి వేగించాలి. జీలకర్ర పొడి, గరంమసాల వేసి ఒక కప్పు నీళ్లు పోసి  చిన్నమంటపై ఉడికించాలి. బటర్‌ మసాలా చిక్కబడిన తరువాత క్రీమ్‌ వేయాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత వేగించి పెట్టుకున్న బేబీ కార్న్‌ వేసి మరో పదినిమిషాలను వేగనివ్వాలి. చివరగా మెంతి ఆకులు చల్లుకుని దింపుకోవాలి. బ్రెడ్‌తో లేదా పులావ్‌తో తింటే రుచిగా ఉంటుంది.

ఆవాల ఆకుల కర్రీ కాజూ మసాలా ఆలూ మేతీసాగో పొంగల్‌ ఘీ రోస్ట్‌ పనీర్‌మేథీ బాజీకరివేపాకు చట్నీకరివేపాకు కర్రీచోలే రాజ్మా కర్రీసోయా బీన్‌ ఆలూ కూర్మాకీటో బటర్‌ పనీర్‌
Advertisement