కృష్ణా: ఆసుపత్రిలో ఆడశిశువు మాయమైన ఘటన జిల్లాలో జరిగింది. మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో అయిదు రోజుల ఆడశిశువు మాయం అయింది. శిశువును గుర్తు తెలియని మహిళ అపహరించింది. పామరు మండలంలోని పెదమద్దాలికి చెందిన సింధూజ, ఏసుబాబులకు ప్రభుత్వాస్పత్రిలో ఆడశిశువు జన్మించింది. శిశువు మాయం ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో ఆడశిశువు మాయం ఘటన పట్ణణంలో సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు.