తలకు బదులు, కాళ్లతో బయటకు వచ్చిన శిశువు

ABN , First Publish Date - 2020-05-31T08:10:06+05:30 IST

వికారాబాద్‌ జిల్లా పరిగి సివిల్‌ ఆస్పత్రిలో ఓ గర్భిణికి అరుదైన ప్రసవం జరిగింది. వివరాలు.. పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామానికి చెందిన జరీనాబేగంకు శుక్రవారం రాత్రి...

తలకు బదులు, కాళ్లతో బయటకు వచ్చిన శిశువు

వైద్యుడి కృషితో.. పరిగి ఆస్పత్రిలో అరుదైన కాన్పు


పరిగి, మే 30: వికారాబాద్‌ జిల్లా పరిగి సివిల్‌ ఆస్పత్రిలో ఓ గర్భిణికి అరుదైన ప్రసవం జరిగింది. వివరాలు.. పూడూరు మండలం మంచన్‌పల్లి గ్రామానికి చెందిన జరీనాబేగంకు శుక్రవారం రాత్రి  నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు పరిగి ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ వైద్యం చేస్తుండగా.. శిశువు తలకు బదులు కాళ్లు ముందు బయటకు కనిపించడంతో ఆందోళన చెందారు. దీంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించాలని భావించారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందనుకుని వైద్యశాఖ ఉన్నతాధికారుల సలహాతో ప్రవీణ్‌కుమార్‌ ధైర్యం చేసి సాధారణ ప్రసవం జరిగేలా కృషి చేశారు. దీంతో జరీనాబేగం పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. మూడు గంటల పాటు తాము చేసిన ప్రయత్నం విజయవంతమైందని, ఇలాంటి ప్రసవం లక్ష మందిలో ఒకటి ఉంటుందని డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.  

Updated Date - 2020-05-31T08:10:06+05:30 IST