Abn logo
Nov 28 2020 @ 00:04AM

శిశువును రోడ్డు పక్కన వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు

జిల్లా కేంద్రంలో ఘటన

నిజామాబాద్‌ అర్బన్‌, నవంబరు 27: జిల్లా కేంద్రంలోని ఖలీల్‌వాడి ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన మగశిశువును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. బిడ్డ ఏడుపు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉదయం 3 గంటల ప్రాంతంలో చలిలో ఏడుస్తున్న మగ శిశువును పోలీసులు స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించగా, వారు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. 

Advertisement
Advertisement