Abn logo
Sep 28 2021 @ 01:41AM

American లకు అలా కలిసొచ్చిన కరోనా .. ఎప్పటి నుంచో ఉన్న సమస్యను పరిష్కరించిన Covid

వాషింగ్టన్: కరోనా మహమ్మారి కారణంగా అమెరికన్లు ఆర్థికంగా, మానసికంగా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారు. అనేక కుటుంబాలు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డాయి. ఇంకొన్ని ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. దీంతో పిల్లల విషయంలో కనీసం ఆలోచన కూడా చేయడానికి భయపడ్డారు. అయితే ప్రస్తుతం కోవిడ్ ప్రభావం తగ్గడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుండడంతో కుటుంబంలోనికి ఓ కొత్త బంధువును ఆహ్వానించేందుకు భార్య భర్తల సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే కోవిడ్ క్వారంటైన సమయంలో వారికి బాగా కలిసొస్తోంది.

ఎప్పటి నుంచో అమెరికాలో జననాల సంఖ్యను పెంచాలని వైద్యశాఖ  భావిస్తోంది. కానీ సాధ్యపడడం లేదు. అయితే కోవిడ్ క్వారంటైన్ పుణ్యమా అని ఈ సంఖ్య బాగానే పెరిగింది. అట్లాంటికేర్ నేషనల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ డాక్టర్.. జెన్నిఫర్ టియోసెకో ప్రకారం.. ‘జూన్ నెలలో 193 జననాలు నమోదయ్యాయి. జూలైలో 194, ఆసగస్టుల్లో 190 నమోదయ్యాయి. అంటే అంతకుముందుతో పోల్చితే నెలకు కనీసం 30కి పైగా జననాలు నమోదయ్యియని జెన్నిఫర్ వివరించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...