గుంటూరు: జీజీహెచ్(GGH) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య(Aradhya) మృత్యువుతో పోరాడుతోంది. గత శనివారం నుండి ఆరాధ్య వెంటిలేటర్‌పైనే ఉంది. కంటి కింద కణితి తొలగించాలని గత గురువారం ఆరాధ్యను తల్లిదండ్రులు జీజీహెచ్‌లో చేర్పించారు అయితే శనివారం ఆపరేషన్ అనంతరం చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మెరుగైన వైద్యం కోసం సోమవారం నగరంలో ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు అధికారులు తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు... చిన్నారి విషయంలో జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్ ఓ కమిటీ వేశారు. ఆరు రోజులు గడిచిన ఇంకా వెంటిలేటర్ పైనే ఆరాధ్య ఉండటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురికి ఏమైందో చెప్పాలని వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి