విరాట్‌ను అధిగమించిన బాబర్‌

ABN , First Publish Date - 2022-06-30T08:56:30+05:30 IST

విరాట్‌ను అధిగమించిన బాబర్‌

విరాట్‌ను అధిగమించిన బాబర్‌

దుబాయ్‌: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సుదీర్ఘ కాలం అగ్రస్థానంలో నిలిచిన బ్యాటర్‌గా పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. బుధవారం విడుదల చేసిన టీ20 ర్యాంకుల జాబితాలో ఆజమ్‌ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో 1,013 రోజులు టాప్‌లో కొనసాగిన కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు. ఇషాన్‌ కిషన్‌  ఏడో ర్యాంక్‌లో ఉండగా.. దీపక్‌ హుడా 404 ర్యాంక్‌లు ఎగబాకి 104వ స్థానంలో, సంజూ శాంసన్‌ 144వ ర్యాంక్‌లో నిలిచారు. బౌలర్లలో హర్షల్‌ పటేల్‌ 33వ ర్యాంక్‌ దక్కించుకున్నాడు. 

Updated Date - 2022-06-30T08:56:30+05:30 IST