నోరు పారేసుకున్న కేంద్ర మంత్రికి విహారి హుందాగా జవాబు!

ABN , First Publish Date - 2021-01-14T10:00:06+05:30 IST

సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారిపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి బాబుల్‌ సుప్రియో అవగాహన రాహిత్యంతో నోరు పారేసుకున్నాడు. తొడ కండరగాయం బాధిస్తున్నా విహారి అసమాన పోరాటంతో ఆసీస్‌తో మూడో టెస్టును భారత్‌ డ్రాగా...

నోరు పారేసుకున్న కేంద్ర మంత్రికి విహారి హుందాగా జవాబు!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): సిడ్నీ టెస్టు హీరో హనుమ విహారిపై కేంద్ర పర్యావరణశాఖ మంత్రి బాబుల్‌ సుప్రియో అవగాహన రాహిత్యంతో నోరు పారేసుకున్నాడు. తొడ కండరగాయం బాధిస్తున్నా విహారి అసమాన పోరాటంతో ఆసీస్‌తో మూడో టెస్టును భారత్‌ డ్రాగా ముగించగలిగిన సంగతి తెలిసిందే. అయితే, తనకు క్రికెట్‌పై ఎలాంటి అవగాహన లేదంటూనే.. ఆ మ్యాచ్‌లో విహారి దారుణంగా ఆడాడంటూ మంత్రి బాబుల్‌ విమర్శనాత్మక ట్వీట్‌ చేశారు. ‘109 బంతులాడి చేసింది 7 పరుగులు. ఇంతకంటే దారుణం ఉండదు. హనుమ బిహారి (తప్పుగా) భారత్‌ చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకోవడాన్ని మాత్రమే నాశనం చేయలేదు.. క్రికెట్‌ను కూడా ఖూనీ చేశాడు’ అని మంత్రి ట్వీట్‌ చేశాడు. కాగా.. మంత్రి తనపై చేసిన విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా విహారి.. ఆ ట్వీట్‌లో తన పేరును బిహారి అని తప్పుగా రాయడాన్ని గుర్తు చేస్తూ.. ‘నా పేరు హనుమ విహారి’ అని బదులిచ్చాడు. ఇప్పుడీ ట్వీట్‌ వైరల్‌గా మారింది. విహారి.. భలే సమాధానమిచ్చావంటూ అతని అభిమానులతో పాటు అశ్విన్‌, సెహ్వాగ్‌ కూడా ఆ ట్వీట్‌పై స్పందించారు.

Updated Date - 2021-01-14T10:00:06+05:30 IST