విశాఖపట్నం: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మన రాష్ట్రంలో ఐరన్ లెగ్ సీఎం జగన్ ఉన్నారంటూ విశాఖపట్నం జిల్లాలోని తాళ్లవలసలో జరిగిన సభలో చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి అన్యాయం మనం ఎన్నడూ చూడలేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు మండిపడ్డారు. దేశంలో కల్లా పెట్రోధరలు ఏపీలోనే ఎక్కువగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాలు విసిరారు. ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు అధికంగా ఉంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. కోర్టు ఆదేశంతో గ్రామ సచివాలయాల రంగులు మార్చారని, రంగుల మార్పు కోసం ప్రజాధనాన్ని వృథా చేశారనిచంద్రబాబు మండిపడ్డారు. టెన్త్ పేపర్ లీక్ వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని, నాడు-నేడు అంటూ పాఠశాలలకు వైసీపీ రంగులు వేశారని, తన పోరాటం తన కోసం కాదని, మీ కోసం అని చంద్రబాబు అన్నారు.పెళ్లి అయితే కళ్యాణ కానుక, పండుగ అయితే పండుగ కానుక ఇచ్చామని చంద్రబాబు చెప్పారు.
ఇవి కూడా చదవండి