అసెంబ్లీలో చర్చలో వైసీపీ ఎమ్మెల్యేల వ్యాఖ్య
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనా సమయంలో చంద్రబాబు రాష్ట్రంలో లేకుండాపోయారు. ఆయన ఎన్‌ఆర్‌ఐ. 75ఏళ్ల వయస్సులో చంద్రబాబు, కరోనా వస్తుందన్న భయంతో ప్రజల కోసం బయటకు రాలేదంటే అర్థ చేసుకోగలం. ఆయన కొడుకు గున్న ఏనుగులా ఉన్నాడు. ప్రజాసేవకు బయటకు రావొచ్చుకదా?’’ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసుధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం ‘కొవిడ్- ఆరోగ్యశ్రీ’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌తో కష్టాల్లో ఉంటే ప్రజలకు చంద్రబాబు కనీసం కేజీ కందిపప్పు, నాలుగు మజ్జిగ ప్యాకేట్‌లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘‘టీడీపీ ఎమ్మెల్యేలు కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయలేదు. కాబట్టే వారికి కొవిడ్ రాలేదు’’ అని ఎమ్మెల్యే రోశయ్య ఆక్షేపించారు.