చంద్రబాబు హయాంలో ఇలాంటి దారుణాలు లేవు

ABN , First Publish Date - 2021-10-20T03:20:01+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబునాయుడు హయాంలో ఎక్కడా తప్పుడు కేసులు, కక్షసాధింపు దోరణిలు లేవని, సీఎం జగన్‌ వచ్చాక అ

చంద్రబాబు హయాంలో ఇలాంటి దారుణాలు లేవు
పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నినాదాలు చేస్తున్న యాదవ మహాసభ రాష్ట్ర నాయకులు

తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు 

కోట, అక్టోబరు 19 : మాజీ సీఎం చంద్రబాబునాయుడు  హయాంలో ఎక్కడా తప్పుడు కేసులు, కక్షసాధింపు దోరణిలు లేవని,  సీఎం జగన్‌ వచ్చాక అకృత్యాలు జరుగుతున్నాయని తెలుగు యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కోనా గురవయ్యయాదవ్‌ అన్నారు. కోట పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మంగళవారం రాష్ట్ర యాదవ మహాసభ ఆధ్వర్యంలో నిరసన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుల సహకారంతో అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు.  ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలకు ఊపిరిపోస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుబాబు, వెంకట్‌, కె. మధుయాదవ్‌, సుంకర నాగూర్‌యాదవ్‌, వెంకటేశ్వర్లు, ఎరగల వీరయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T03:20:01+05:30 IST