బాబ్రీపై సీబీఐ కోర్టు తీర్పు ఆశ్చర్యానికి గురిచేసింది: రామకృష్ణ

ABN , First Publish Date - 2020-09-30T22:58:51+05:30 IST

బాబ్రీపై సీబీఐ కోర్టు తీర్పు ఆశ్చర్యానికి గురిచేసిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో కూల్చివేత నేరపూరిత

బాబ్రీపై సీబీఐ కోర్టు తీర్పు ఆశ్చర్యానికి గురిచేసింది: రామకృష్ణ

అమరావతి: బాబ్రీపై సీబీఐ కోర్టు తీర్పు ఆశ్చర్యానికి గురిచేసిందని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులో కూల్చివేత నేరపూరిత చర్యగా పేర్కొనడం గమనార్హమన్నారు. 28 ఏళ్ల తర్వాత కూడా దోషులను గుర్తించకపోవటం విచారకరమని రామకృష్ణ వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ స్పెషల్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. అయితే కోర్టు తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2020-09-30T22:58:51+05:30 IST