బాబోయ్‌ జ్వరాలు

ABN , First Publish Date - 2022-01-23T05:18:21+05:30 IST

మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్నారు.

బాబోయ్‌ జ్వరాలు
ఆసుపత్రి వద్ద ఉన్న రోగులు

  1. పెరిగిపోతున్న జ్వర పీడితులు
  2. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఇబ్బందులు 
  3. మరో పక్క ఒమైక్రాన్‌ భయం 


చాగలమర్రి, జనవరి 22: మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ మంది జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంట్లో  ఎవరో ఒకరు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జలుబు, దగ్గు వచ్చి ఒకటి రెండు రోజుల్లోనే తగ్గి తరువాత జ్వరంగా మారుతోందని చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి నలుగురిలో ఇద్దరు జ్వరం, జలుబు, దగ్గు, ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు కూడా క్యూకడుతున్నారు. కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో మూడు రోజులకు మించి జ్వరం ఉన్నవారు భయాందోళనకు గురౌతున్నారు. వైరల్‌ జ్వరాలతోపాటు కరోనా కేసులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ ఇంటింటికి వచ్చి ఫివర్‌ సర్వే చేయాలని, జ్వరం ఉన్న వారికి తగిన మందులు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా గ్రామంలోని అన్ని వీధుల్లో పారిశుధ్య చర్యలు ముమ్మరం చేయాలని, క్లోరినేషన్‌ చేసిన నీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉంది.



Updated Date - 2022-01-23T05:18:21+05:30 IST