Advertisement
Advertisement
Abn logo
Advertisement

చరిత్ర సృష్టించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం.. గేల్, విరాట్ కోహ్లీ రికార్డుల బద్దలు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 7 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టేశాడు.


నేషనల్ టీ20 కప్‌లో భాగంగా సదరన్ పంజాబ్-సెంట్రల్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆజం ఈ ఘనత సాధించాడు. బాబర్ తన 187వ టీ20 మ్యాచ్‌లో 7 వేల పరుగుల మార్కును చేరుకోగా, గేల్ 192, కోహ్లీ 212 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత అందుకున్నారు. 


బాబర్ ఖాతాలోని మొత్తం 7 వేల పరుగుల్లో 2,204 పరుగులు పాక్ తరపున ఆడిన 61 అంతర్జాతీయ మ్యాచుల్లో సాధించినవి కావడం గమనార్హం. 46.89 సగటుతో ఈ పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి.


పాకిస్థాన్ సూపర్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, ఇంగ్లండ్‌లోని విటాలిటీ బ్లాస్ట్ వంటి ఫ్రాంచైజీ క్రికెట్‌లో 84 మ్యాచుల్లో 3,058 పరుగులు సాధించాడు. అత్యంత వేగంగా 7 వేల పరుగులు సాధించిన రికార్డుతోపాటు టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డు బద్దలైంది. కోహ్లీ 315 మ్యాచుల్లో 5 సెంచరీలు చేయగా, బాబర్ 194 మ్యాచుల్లోనే ఆరు సెంచరీలు సాధించాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement