ఆ ఘనత సాధించిన తొలి పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్

ABN , First Publish Date - 2021-05-11T10:44:11+05:30 IST

ఈ ఏడాది ఏప్రిల్ నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా పాకిస్తాన్ యువ సంచలనం బాబర్ ఆజమ్ ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతేతర క్రికెట్ ప్లేయర్ బాబరే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ అవార్డును భారతీయ క్రికెటర్లే పొందుతూ వచ్చారు.

ఆ ఘనత సాధించిన తొలి పాక్ క్రికెటర్ బాబర్ ఆజమ్

ముంబై: ఈ ఏడాది ఏప్రిల్ నెలకుగానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా పాకిస్తాన్ యువ సంచలనం బాబర్ ఆజమ్ ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతేతర క్రికెట్ ప్లేయర్ బాబరే కావడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ అవార్డును భారతీయ క్రికెటర్లే పొందుతూ వచ్చారు. ఇప్పుడు దీన్ని బాబర్ పొందాడు. 26 ఏళ్ల బాబర్ ఆజమ్.. ఇటీవలే టీమిండియా సారధి విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి వన్డేల్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఒక్క నెలలోనే వన్డేల్లో 228 పరుగులు, టీ20ల్లో 305 పరుగులు చేసిన బాబర్.. వన్డేల్లో ఐసీసీ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, మహిళల క్రికెటలో అలిస్సా హేలీకి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది.

Updated Date - 2021-05-11T10:44:11+05:30 IST