‘అందరికీ యోగా’ కోసం...

ABN , First Publish Date - 2020-02-14T06:11:43+05:30 IST

యోగాను మతరహితమైన సాధనంగా, శాస్త్రీయమైన ఉపకరణంగా వినియోగిస్తూ మానవ శ్రేయస్సుకు దోహదం చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది భారతీయ యోగా సంఘం (ఐవైఎ). దాని రెండో పాలకమండలి సమావేశాన్ని...

‘అందరికీ యోగా’ కోసం...

యోగాను మతరహితమైన సాధనంగా, శాస్త్రీయమైన ఉపకరణంగా వినియోగిస్తూ మానవ శ్రేయస్సుకు దోహదం చేయడం లక్ష్యంగా పనిచేస్తోంది భారతీయ యోగా సంఘం (ఐవైఎ). దాని రెండో పాలకమండలి సమావేశాన్ని తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని ఈశా యోగకేంద్రంలో ఇటీవల నిర్వహించారు. నిర్దేశిత లక్ష్య సాధన దిశగా పని చేస్తున్న వివిధ సంఘాల అధిపతులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిగాయి. ఆ సాధనాల శాస్త్రీయతను పరిరక్షిస్తూ, ఎక్కువమందికి యోగాను దగ్గర చేయడానికి వీలైన మౌలిక సదుపాయాల ఏర్పాటు, వివిధ సంస్థల భాగస్వామ్యం, క్రీడగా యోగాను ప్రోత్సహించడం, ఈ దిశగా ప్రభుత్వం నుంచి సహకారం పొందడం తదితర విషయాలు ఈ చర్చల్లో చోటు చేసుకున్నాయి. ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌, ఐవైఎ ఛైర్మన్‌ బాబా రామ్‌దేవ్‌ తదితర ప్రముఖులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

Updated Date - 2020-02-14T06:11:43+05:30 IST