Abn logo
Dec 3 2020 @ 01:40AM

ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో బీఏ, ఎంఏ

పలు నిర్మాణాలు, మరమ్మతులకు మహిళా వర్సిటీ పాలకమండలి ఆమోదం


తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 2: పద్మావతి మహిళా యూనివర్సిటీలో పలు నిర్మాణాలు, మరమ్మతులు చేపట్టడానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. వీసీ చాంబర్‌లో బుధవారం ఆన్‌లైన్‌ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించారు. ఇందులో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సతీష్‌ చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, రాష్ట్ర కాలేజియేట్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ ఎంఎం నాయక్‌, వీసీ జమున, రిజిస్ట్రార్‌ మమత పాల్గొన్నారు. మల్టీ ఎంట్రీ అండ్‌ మల్టీ ఎగ్జిట్‌ పేరుతో బీఏ, ఎంఏ కోర్సును ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో నిర్వహించేందుకు ఆమోదం తెలిపారు. అధ్యాపకుల పదోన్నతులకు సంబంధించిన సీఏఎస్‌ ఇంటర్వ్యూలు చేపట్టాలని తీర్మానించారు. అసంపూర్తిగా ఉన్న కేఎల్‌రావు భవన్‌ను పూర్తిచేయాలని, హ్యూమనిటీస్‌ బ్లాక్‌లో మూట్‌ కోర్టు ఏర్పాటు, రోడ్ల మరమ్మతులకు, మల్టీ పర్సస్‌ హాల్‌ నిర్మాణానికి, సిరికల్చర్‌ కాంప్లెక్స్‌ రోడ్డు విస్తరణ పనులకు, నర్సింగ్‌ కాలేజీ భవనానికి మరమ్మతులు చేపట్టాలని  నిర్ణయించారు. 

Advertisement
Advertisement
Advertisement