8న ఏయూ బీఏ, బీకాం కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష

ABN , First Publish Date - 2020-10-30T06:18:35+05:30 IST

ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ స్టడీ సెంటర్‌ ఆధ్వర్యంలో బీఏ, బీకామ్‌ కోర్సులో దూర విద్యా విధానం ద్వారా అభ్యసించే విద్యార్థులకు నవంబరు 8న కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పీఆర్‌ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌, దూరవిద్యా కేంద్రం (ఏయూ) కోఆర్డినేటర్‌ చప్పిడి కృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

8న ఏయూ బీఏ, బీకాం కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష

కాకినాడ రూరల్‌, అక్టోబరు 29: ఆంధ్రా యూనివర్సిటీ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ స్టడీ సెంటర్‌ ఆధ్వర్యంలో బీఏ, బీకామ్‌ కోర్సులో దూర విద్యా విధానం ద్వారా అభ్యసించే విద్యార్థులకు నవంబరు 8న కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నట్టు పీఆర్‌ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపాల్‌, దూరవిద్యా కేంద్రం (ఏయూ) కోఆర్డినేటర్‌ చప్పిడి కృష్ణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్‌ పరీక్ష సెప్టెంబరు 13న జరగాల్సి ఉందని, కొవిడ్‌ ఉధృతి కారణంగా వాయిదా పడిందన్నారు. ఎటువంటి విద్యార్హత లేకపోయినా జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండితే ఎంట్రన్స్‌ పరీక్ష రాసేందుకు అర్హులన్నారు. నవంబరు 8 (ఆదివారం) ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని కోరారు. కాకినాడ పీఆర్‌ కళాశాలలో ఎంట్రన్స్‌ పరీక్ష జరుగుతుందన్నారు. ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులు పీఆర్‌ కాలేజీ దూరవిద్యా కేంద్రంలో పొందవచ్చన్నారు. ఇతర సమాచారం కోసం 0884-2383788, 77022 57825 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Updated Date - 2020-10-30T06:18:35+05:30 IST