Abn logo
Jan 15 2021 @ 20:03PM

ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన క్రికెటర్.. కలల లిస్టు బయటపడటంతో..

తిరువనంతపురం: తాజాగా ముంబై-కేరళ జట్ల మధ్య జరిగిన ఓ క్రికెట్ మ్యాచులో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన కేరళ ఓపెనర్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ పాపులర్ అయ్యాడు. ముంబై మ్యాచులో కేవలం 37 బంతుల్లోనే అజారుద్దీన్ సెంచరీ సాధించాడు. దీంతో అత్యంత వేగంగా ఓ టీ20 సెంచరీ సాధించిన భారత బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా అజారుద్దీన్ నిలిచాడు. ఇప్పటి వరకూ ఈ ఘనత ఇద్దరు భారత ఆటగాళ్లు సాధించారు. ఈ క్రమంలో అజారుద్దీన్ తను భవిష్యత్తులో సాధించాల్సిన కలలను ఓ పేపర్‌పై రాసి ఇంట్లో ఓ బోర్డుపై తగిలించాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఈ జాబితా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ జాబితాలో ‘ఐపీఎల్, ఓ రంజీ సీజన్లో 4 సెంచరీలు, సొంత ఇల్లు, బెంజి కారు, 2023 ప్రపంచ కప్’ ఉన్నాయి. ఈ ఫొటో చూసిన ఫ్యాన్స్.. అజారుద్దీన్ కలలన్నీ నిజం కావాలని కోరుకుంటున్నారు. ఈ లిస్టు బయటపడిన తర్వాత అజారుద్దీన్ మరింత పాపులర్ అయినట్లు కనిపిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement