ఉత్సాహంగా ‘ఆజాదీకా అమృత మహోత్సవ్‌’

ABN , First Publish Date - 2022-08-13T05:44:27+05:30 IST

ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ సిబ్బంది జాతీ య జెండాలను పంపిణీ చేశారు

ఉత్సాహంగా ‘ఆజాదీకా అమృత మహోత్సవ్‌’
ముదిగుబ్బలో 75 ఆకారంలో విద్యార్థుల ప్రదర్శన

పుట్టపర్తిరూరల్‌, ఆగస్టు 12: ఆజాదీకా అమృత మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ బసంతకుమార్‌ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ సిబ్బంది జాతీ య జెండాలను పంపిణీ చేశారు. ఇందులో డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, డీపీఓ బాలాజీ, స్పందన తహసీల్దార్‌ గోపాలకృష్ణ, కలెక్టరేట్‌ ఏఓ నాగరాజు, సీపీఓ విజయ్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీధర్‌  పాల్గొన్నారు.  

ముదిగుబ్బ : ఆజాదీకా అమృత మహో త్సవంలో భాగంగా ముదిగుబ్బలో శుక్రవారం బాలికల ఉన్నత పాఠశాల నుంచి పోలీస్‌ స్టేషన వరకు విద్యార్థులు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.  అనంతరం బస్టాండ్‌ కూడలిలో మానవహారంగా ఏర్ప డ్డారు. పాఠశాల ఆవరణంలో 75 సంవ త్సరాలు పూర్తీ చేసుకున్న సందర్భంగా 75 ఆకారంలో విద్యార్థులు కూర్చున్నారు. కార్యక్ర మంలో హెచఎం ఎలిజబెత, పీడీ రేఖ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-13T05:44:27+05:30 IST