ఘనంగా ఆజాదీకా అమృత మహోత్సవ్‌

ABN , First Publish Date - 2022-08-09T06:32:04+05:30 IST

విద్యార్థి దశ నుంచే విద్యార్థులు దేశభక్తిని పెంచుకోవాలని ఎంపీడీవో సాయికుమార్‌ అన్నారు.

ఘనంగా ఆజాదీకా అమృత మహోత్సవ్‌
కంభంలో భారీ జాతీయ జెండా ప్రదర్శన

కంభంలో 350 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

ఎర్రగొండపాలెం, ఆగస్టు 8 : విద్యార్థి దశ నుంచే విద్యార్థులు దేశభక్తిని పెంచుకోవాలని ఎంపీడీవో సాయికుమార్‌ అన్నారు. స్థానిక నలంద హైస్కూల్‌లో సోమవారం జరిగిన ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌పై విద్యార్ధులకు, వ్యాసరచన, క్విజ్‌ పోటీలసు, వకృత్వ పోటీలలో విజేతలకు బహుమతుల పంపిణీలో ఎంపీడీవో పాల్గొని మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమకారుల జీవిత విశేషాలపై విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ప్రతిభకనబరిచిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో పి.ఆంజనేయులు, కరస్పాండెంట్‌ భూమిరెడ్డి పద్మజ, డైరక్టరు రామకిష్ణారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ఇంటిపై స్వాతంత్య్రదినోత్సవంనాడు మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని  విద్యార్ధులకు ఎంఈ వో పి.ఆంజనేయులు సూచించారు.

కంభం(బేస్తవారపేట), ఆగస్టు 8: కంభంలో లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో సోమవారం అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం కంభం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. 350 అడుగుల భారీ జాతీయ పతాక ప్రదర్శన పురవీధుల్లో ప్రత్యేక ఆకర్షణ నిలిచింది. కంభంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఏఆర్‌ఆర్‌టీపీఆర్‌, వాసవీ విద్యార్థులు, ఎన్‌సీపీ యూనిట్‌ విద్యార్థులు చేసిన కవాతు అందరిని అకర్షించింది. ఆల్ఫా పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషదారణతో  ప్రత్యేకాకర్షణగా నిలిచారు. కార్యక్రమం కంభం లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు సయ్యద్‌ జాకీర్‌ హుస్సేన్‌, కార్యదర్శి బైసాని రామకృష్ణ, మాజీ అధ్యక్షుడు పులి శ్రీనివాస ప్రసాద్‌, ఎంపీపీ చేగిరెడ్డి తులశమ్మ అర్ధవీడు ఎంపీపీ మేడూరి వెంకట్రావు ఎంపీడీవో నరసయ్య, ఎంఈవో జింకా వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ బోడెయ్య, పీరా తదితరులు పాల్గొన్నారు.

మార్కాపురం(వన్‌టౌన్‌), ఆగస్టు 8: స్థానిక శ్రీ సాధన జూ.కళాశాల విద్యార్థులు ఆజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా జాతీయ జెండాలు చేపట్టి సోమవారం పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డా.టి.కృష్ణారెడ్డి, డైరెక్టర్లు డి.రాజగోపాల్‌రెడ్డి, ఎం.వీ.కృష్ణారెడ్డి, వీఆర్‌కె ప్రసాద్‌, జి.ఎల్‌.రమేష్‌బాబు అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T06:32:04+05:30 IST