ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం

ABN , First Publish Date - 2022-08-08T05:58:43+05:30 IST

మండలంలోని కేతగుడిపిలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం
తర్లుబాడులో అధికారుల ర్యాలీ

తర్లుపాడు, ఆగస్టు 7: మండలంలోని కేతగుడిపిలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సచివాలయం నుంచి ప్రజాప్రతినిధులు, అధి కారులు, విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వ హించి ‘హర్‌ ఘర్‌ తిరంగా’ అంటూ నినాదాలు చేస్తూ, పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఎస్‌.నరసింహులు మాట్లాడుతూ.. భారతదేఽశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సంద ర్భంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నార న్నారు. బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం తృణ ప్రాయంగా త్యాగం చేసిన ఫలితమే నేటి మన స్వాతంత్య్రం అన్నారు. ఈ సందర్భంగా స్వాతం త్య్ర సమరయోధుల గురించి వివరించారు. ఆగస్టు 15న ప్రతి ఇంట జాతీయజెండా ఎగురవేయాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బాలసుబ్రహ్మణ్యం, వెలుగు ఏపీఎం డి.పిచ్చయ్య, పలువురు ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పొదిలి రూరల్‌ : మవ్వన్నేల జెండా అందరి ఇళ్లపై రెపరెలాడాలని మన్సిపల్‌ కమిషనర్‌ డానియోల్‌ జోసఫ్‌ అన్నారు. పట్టణంలో ఆదివారం ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కార్యక్రమాన్ని పురష్కరించుకొని 75 సంవత్స రాలు నిండిన జాతీయ జెండాకు వందనం సమర్పించి స్థానిక మండల పరిషత్‌ కార్యాల యం దగ్గర నుండి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ 13 నుండి 15 వరకు అందరి ఇళ్లపైన జెండా ఎగరవేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటి తహసీల్దార్‌ భాగ్యలక్ష్మీ, ఈవోఆర్డీ రాజశేఖర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ నారు శ్రీని వాసరెడ్డి, పంచాయతీ కార్మికులు, ఆశాలు, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T05:58:43+05:30 IST