Abn logo
Jun 15 2021 @ 03:25AM

హైదరాబాద్‌లో రూ.600 కోట్లతో ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ యూనిట్‌

  • ఆజాద్‌ ఇంజనీరింగ్‌ వెల్లడి 
  • రూ.145 కోట్ల నిధుల సమీకరణ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ కంపెనీ ఆజాద్‌ ఇంజనీరింగ్‌ హైదరాబాద్‌లో రెండో తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేస్తోంది. వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.600 కోట్లతో రెండో యూనిట్‌ను నిర్మిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇందులో భాగంగా డీఎంఐ మేనేజ్‌మెంట్‌ నుంచి రెండు కోట్ల డాలర్ల (దాదాపు రూ.145 కోట్లు) నిధులను సమీకరించింది. కొత్త యూనిట్‌ను 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని.. ఈ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే వ్యాపార విస్తరణ జరుగుతుందని తెలిపింది. జీఈ, మిత్సుబుషి, సీమన్స్‌, తోషిబా, జీఈ ఏవియేషన్‌, బోయింగ్‌, రాఫెల్‌, భెల్‌.. కంపెనీకి ఖాతాదారులుగా ఉన్నాయి.