అయ్యో.. ఔషధ గిడ్డంగి

ABN , First Publish Date - 2022-05-15T05:46:04+05:30 IST

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రధాన ఆస్పత్రులకు మందులను సరఫరా చేసే హనుమకొండలోని కేంద్ర ఔషధ గిడ్డంగి (సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌) పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. రోగులకు కావలసిన మందులను నిల్వ చేసి ఎప్పటికప్పుడు సరఫరా చేయాల్సిన ఈ గిడ్డంగి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వరంగల్‌ను హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కొత్త ఆస్పత్రుల నిర్మాణాన్ని, ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల ఉన్నతీకరణను చేపడుతున్న ప్రభుత్వం.. కేంద్ర ఔషధ గిడ్డంగి విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే వివిధ రకాల మందులు, ఇంజక్షన్లు, సర్జికల్‌ పరికరాలను నిల్వ చేసే గిడ్డంగి నిర్వహణ బాధ్యతను చూసేందుకు ఫార్మసిస్టునే నియమించడం లేదు. దీంతో మందుల నిల్వలలో ప్రమాణాలు లోపిస్తున్నాయి.

అయ్యో.. ఔషధ గిడ్డంగి
భీమారంలోని కేంద్ర ఔషధ గిడ్డంగి

అధ్వానంగా సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ నిర్వహణ
ఆరు నెలలుగా ఫార్మసిస్టు పోస్టు ఖాళీ
ఇంజనీరింగ్‌ అధికారికి పర్యవేక్షణ బాధ్యత
మందుల నిల్వలో లోపిస్తున్న శాస్త్రీయత
నాణ్యతను కోల్పోతున్న విలువైన సామగ్రి
ఏటా రూ.20 కోట్ల విలువైన మెడిసిన్‌ రాక


ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ప్రధాన ఆస్పత్రులకు మందులను సరఫరా చేసే హనుమకొండలోని కేంద్ర ఔషధ గిడ్డంగి (సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టోర్‌) పరిస్థితి అత్యంత  అధ్వానంగా ఉంది. రోగులకు కావలసిన మందులను నిల్వ చేసి ఎప్పటికప్పుడు సరఫరా చేయాల్సిన ఈ గిడ్డంగి నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. వరంగల్‌ను హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కొత్త ఆస్పత్రుల నిర్మాణాన్ని, ప్రస్తుతం ఉన్న ఆస్పత్రుల ఉన్నతీకరణను చేపడుతున్న ప్రభుత్వం.. కేంద్ర ఔషధ గిడ్డంగి విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే వివిధ రకాల మందులు, ఇంజక్షన్లు, సర్జికల్‌ పరికరాలను నిల్వ చేసే గిడ్డంగి నిర్వహణ బాధ్యతను చూసేందుకు ఫార్మసిస్టునే నియమించడం లేదు. దీంతో మందుల నిల్వలలో ప్రమాణాలు లోపిస్తున్నాయి.

హనుమకొండ, మే 14 (ఆంధ్రజ్యోతి) : హనుమకొండ జిల్లా కేంద్రంలోని భీమారంలోని టీబీ ఆస్పత్రి వద్ద కేంద్ర ఈ ఔషధ గిడ్డంగి ఉంది. హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు మందులను సరఫరా చేసే ఏకైక సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఇదే. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 91 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 500కుపైగా ఆరోగ్య ఉప కేంద్రాలుు, 20 కమ్యూనిటీ హెల్త్‌ సెంట్లర్లు, 8 ఏరియా ఆస్పత్రులతో పాటు నాలుగు జిల్లాలకు ఏకైక పెద్ద ఆస్పత్రి అయిన ఎంజీఎం, హనుమకొండ, వరంగల్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు, భీమారంలోని టీబీ ఆస్పత్రి, వరంగల్‌లోని ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ఉమ్మడి జిల్లాలోని 50 పట్టణ ఆరోగ్య కేంద్రాలకు సైతం మందులు ఈ స్టోర్‌ నుంచే సరఫరా అవుతాయి. ఇటీవల కేఎంసీ ఆవరణలో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి సైతం మందులు ఇక్కడి నుంచే పంపిణీ అవుతాయి. ఈ ఆస్పత్రులన్నిటికీ యేటా పంపే సుమారు రూ.20 కోట్ల విలువైన మందులు ఇక్కడే నిల్వ చేస్తారు.

ఫార్మసిస్టు లేక..
ఈ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో గతంలో ఒక ఫార్మసిస్టు ఉండేవారు. ఆర్నెళ్ల కిందట ఉద్యోగుల పునర్విభజనలో భాగంగా ఆయన బదిలీపై ఇతర ప్రాంతానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఫార్మసిస్టు లేడు. వైద్య, ఆరోగ్య శాఖలో అర్హులైన ఫార్మసిస్టులు ఉన్నప్పటికీ వారిలో ఏ ఒక్కరిని ఇక్కడికి డిప్యూట్‌ చేయలేదు. ఈ డ్రగ్‌ స్టోర్‌లో ప్రస్తుతం ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సుమారు 8 మంది ప్యాకర్లు ఉన్నారు. కోట్లాది రూపాయల విలువైన మందుల నిల్వల గురించిన శాస్త్రీయ పరిజ్ఞానం వీరికి లేదు.

ఫార్మసిస్టు పాత్ర
మందులకు సంబంధించి ఫార్మసిస్టు నిర్వహించే పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. వాటి నాణ్యత, కాలపరిమితిని గుర్తించడం, వివిధ కేటగిరీల కింద వర్గీకరించడం, నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య వాటిని జాగ్రత్తగా భద్రపరచడం, ఇండెంట్‌ను బట్టి ఆయా ఆస్పత్రులకు సకాలంలో సరైన రీతిలో సరఫరా చేయడం, మందులను పంపేప్పుడు సరైన రీతిలో ప్యాకింగ్‌ చేసేట్టు చూసుకోవడం, మందుల నిల్వలను ఎప్పటికప్పుడు రికార్డు చేయడం, కొరత లేకుండా అవసరమైన మందులు సరఫరా అయ్యేట్టు ఇండెంట్‌ పెట్టడం, కాలం చెల్లిన మందులను గుర్తించి వెంటనే తొలగించడం వంటి కీలక బాధ్యతలను ఫార్మసిస్టు మాత్రమే నిర్వహించగలడు. అలాంటి ఫార్మసిస్టు లేకుండానే ఔషధ గిడ్డంగి నడుస్తోంది.

అస్తవ్యస్తం
ఫార్మసిస్టు లేకపోవడం వల్ల మందుల నిల్వల పర్యవేక్షణ లోపించింది. లారీల నుంచి అన్‌లోడ్‌ అయిన మందులు గిడ్డంగి ఆవరణలోనే ఉండిపోతున్నాయి. వాటిని గిడ్డంగి లోపల భద్రపరచడంలో జరుగుతున్న జాప్యం వల్ల బయటి ఉష్ణోగ్రత ప్రభావంతో నాణ్యతను కోల్పోతున్నాయి. ఆస్పత్రులకు మందుల పంపిణీలోనూ జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇప్పటికైనా కోట్ల రూపాయల విలువైన మందులను సరైన రీతిలో నిల్వ చేసి, సకాలంలో ఆస్పత్రులకు పంపిణీ చేయడానికి ఫార్మసిస్టును నియమించాలని ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రుల వైద్యాధికారులు కోరుతున్నారు.

ఇంజనీర్‌ అధికారికి బాధ్యతలు

ఈ ఔషధి గిడ్డంగి పర్యవేక్షణను చూసే బాధ్యతను మందుల గురించి ఏ మాత్రం పరిజ్ఞానం లేని ఒక ఇంజనీరింగ్‌ అధికారికి ప్రభుత్వం అప్పగించింది. టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి చెందిన ఒక ఇంజనీరింగ్‌ అధికారి ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నాడు. దీంతో గిడ్డంగి నిర్వహణలో శాస్త్రీయత లోపించింది. ఫలితంగా వాటి నాణ్యత తగ్గుతోంది. గిడ్డంగికి వచ్చే మందులు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌, నిల్వ, ప్రభుత్వ ఆస్పత్రులకు పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. మందులను శాస్త్రీయంగా నిల్వ చేయకపోవడం వల్ల వాటి నాణ్యత, ప్రామాణికత దెబ్బతిని రోగులకు జబ్బులు నయం కావడం అటుంచి లేని రోగాలు వచ్చే పరిస్థితి ఉంది.

నిల్వ సౌకర్యాలు

ఔషధాలను నిల్వ చేయడానికి డ్రగ్‌ స్టోర్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. వివిధ రకా ల వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, టాబ్లె ట్లు, సర్జికల్‌ పరికరాలు, శస్త్ర చికిత్సలో, కట్లు కట్టడంలో ఉపయోగించే క్లాత్‌, దూది, ఇతరత్రా మందులు ఈ స్టోర్‌లోనే నిల్వ చేస్తారు. ఆయా ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి వ చ్చే ఇండెంట్లను బట్టి సరఫరా చేస్తుంటారు. ముందులు, ముఖ్యంగా వ్యాక్సిన్లను తగిన ఉష్ణోగ్రతల  మధ్య నిల్వ చేయాల్సి ఉంటుంది. లేకుంటే అవి పాడైపోతాయి. ఈ మేరకు ఇందుకు అవసరమైన రిఫ్రిజిరేషన్‌ సౌకర్యాలను కల్పించారు.

Updated Date - 2022-05-15T05:46:04+05:30 IST