కన్నుల పండువగా అయ్యప్ప స్వామి లక్షార్చన

ABN , First Publish Date - 2021-12-06T05:11:00+05:30 IST

పెన్నాతీరంలోని అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి వారి లక్షార్చన మహోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు.

కన్నుల పండువగా అయ్యప్ప స్వామి లక్షార్చన
లక్షార్చన చేస్తున్న మాలధారులు

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 5: పెన్నాతీరంలోని అయ్యప్పస్వామి ఆలయంలో స్వామి వారి లక్షార్చన మహోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం స్వామి వారి కి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించారు. గణపతి, సుబ్రహ్మణ్యం, అయ్యప్పస్వామి, వేంకటేశ్వరస్వామి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి, అయ్యప్పస్వామి, మహాలక్ష్మిదేవి ఉత్పవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేశారు. 400 మంది మాలధారులు లక్షార్చన మహోత్సవంలో పాల్గొని పూజా ద్రవ్యాలతో స్వామివారికి అర్చించారు. అయ్యప్పస్వామి మూల విరాట్‌కు భస్మాభిషేకం, గంధాభిషేకం, నెయ్యాభిషేకం, గోక్షీరాభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. పూజలు అనంతరం 30 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో స్వామి అయ్యప్ప సేవా సంఘం అధ్యక్షుడు నామా రమేష్‌ బాబు, అమృతేశ్వరస్వామి ఆలయ నిర్వాహకులు, రాణి తిరుమల దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు భక్తులకు సేవలు అందించారు.  

Updated Date - 2021-12-06T05:11:00+05:30 IST