బోస్‌డీకే పదాన్ని వదులుతాడా?: అయ్యన్నపాత్రుడు

ABN , First Publish Date - 2021-10-24T22:33:45+05:30 IST

సానుభూతి వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం జగన్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కోడికత్తి నుంచి ప్రతిదానిని వదలని జగన్‌...

బోస్‌డీకే పదాన్ని వదులుతాడా?: అయ్యన్నపాత్రుడు

అమరావతి: సానుభూతి వస్తుందంటే తన ముఖం మీద తానే ఉమ్మేసుకునే రకం జగన్ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు. కోడికత్తి నుంచి ప్రతిదానిని వదలని జగన్‌...బోస్‌డీకే పదాన్ని వదులుతాడా? అని ఆయన ప్రశ్నించారు. సజ్జలను బోస్‌డీకే అంటే అది తననే అన్నారని జగన్ అన్వయించుకున్నారని మండిపడ్డారు. బోస్‌డీకే పదానికి పెడర్థాలు తీసి తల్లి పేరుతో కొత్త సెంటిమెంట్‌ కార్డు జగన్‌ బయటకు తీశారని చెప్పారు. తల్లిపై నిజంగా ప్రేమ ఉంటే తల్లిని బూతులు తిట్టినవారికి మంత్రి పదవులు ఇవ్వడన్నారు. తల్లిని, చెల్లిని తెలంగాణ రోడ్లపై అనాథలుగా వదిలేయరని వ్యాఖ్యానించారు. 

Updated Date - 2021-10-24T22:33:45+05:30 IST