Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెత్తనా కొడుకులు అనక.. ఏమంటారు?: అయ్యన్న

విశాఖ: దిక్కుమాలిన పార్టీకి ఓటు వేశామని, రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందంటూ ప్రజలు బాధ పడుతున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పరిపాలన చేతకాని వారికి ఓట్లు వేస్తే.. ఎలా ఉంటుందో అర్థమైందన్నారు. ఆదాయం ఏంటి?.. దుబారా ఏంటి?.. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏంటి?.. చేస్తున్నది ఏమిటంటూ ప్రశ్నించారు. గతంలో మేము కూడా అప్పులు తెచ్చామని, అభివృద్ధి కోసం ఖర్చు చేశామన్నారు. చెత్త పాలన  చేసిన వారిని చెత్తనా కొడుకులు అనక.. ఏమంటారని నిలదీశారు. బ్రాందీ షాపులు 25ఏళ్లు తాకట్టు పెట్టారని, మళ్లీ మద్యపాన నిషేధం అంటారని ఎద్దేవా చేశారు.


విశాఖ భూముల్ని తాకట్టు పెట్టారని, టూరిజం మంత్రికి  తెలియకుండా టూరిజం రిసార్ట్స్ కూల్చేశారని అయ్యన్న పాత్రుడు విమర్శించారు. హెటిరో డ్రగ్స్ రైడ్స్‌లో దొరికిన సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి  దోచుకున్న సొమ్మెనన్నారు. ఉత్తరాంధ్రలో  ఉన్న ఎమ్మెల్యేలు ఎవరికైనా సరే జరుగుతున్న అన్యాయంపై మాట్లాడే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. హోంమంత్రి కూడా ఏం తెలియకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘38 ఏళ్ల తన రాజకీయ జీవితంలో గంజాయి వ్యాపారంతో సంబంధాలు ఉన్నాయని నిరూపిస్తే ఇంట్లో కూర్చుంటానని, మీరు సిద్ధమా’ అంటూ సవాల్ చేశారు. గంజాయి వ్యాపారం చేస్తున్నవారు.. ఏ పార్టీవారు.. ఎవరు అనేది  పోలీసులకు తెలుసని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించనీయకుండా యువతను గంజాయి, హెరాయిన్  మత్తులో ముంచుతున్నారనే అనుమానంగా ఉందని అయ్యన్న పాత్రుడు అన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement