Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం జగన్‌కు అయ్యన్న బహిరంగ లేఖ

విశాఖ జిల్లా: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగ లేఖ రాశారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడంలో సీఎం జగన్, వ్యవసాయ శాఖ మంత్రి విఫలమయ్యారన్నారు. కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడేను ప్రకటించారన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే పది లక్షల ఎకరాల పంట దెబ్బతిందని, వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చూపిస్తున్న ఖర్చుకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా ఉందని అయ్యన్నపాత్రుడు ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement