Advertisement
Advertisement
Abn logo
Advertisement

విశాఖ రాజధాని పేరుతో ఇక్కడ భూములు దోచుకునే ప్రయత్నం చేశారు: అయ్యన్న

విశాఖ: ప్రభుత్వ౦ ఆలస్యమైనా మంచి నిర్ణయం తీసుకుందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ రాజధాని పేరుతో ఇక్కడ భూములు దోచుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి కూడా రాజధాని ఒక చోటే  ఉండాలని ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారన్నారు. ఎవరు వచ్చినా సరే రాజధాని అక్కడే ఉంటుందన్నారు. రాజధానిపై అసెంబ్లీలో చర్చించి.. దాన్ని చట్టం చేస్తే అప్పుడు నమ్ముతామన్నారు. ఈ ప్రకటన నమ్మడానికి లేదని, పూర్తి ప్రకటన చూసిన తర్వాత స్పందిస్తామని అయ్యన్న పాత్రుడు అన్నారు.

Advertisement
Advertisement