పూనావాలాను ఎత్తుకు రాలేరా? అయ్యన్న కౌంటర్

ABN , First Publish Date - 2021-05-13T01:12:00+05:30 IST

ఏపీలో వ్యాక్సినేషన్ కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య ‘కౌంటర్’ ప్రక్రియ వాడీవేడిగా కొనసాగుతోంది. ఏపీలో

పూనావాలాను ఎత్తుకు రాలేరా? అయ్యన్న కౌంటర్

అమరావతి : ఏపీలో వ్యాక్సినేషన్ కొరతపై అధికార, ప్రతిపక్షాల మధ్య ‘కౌంటర్’ ప్రక్రియ వాడీవేడిగా కొనసాగుతోంది. ఏపీలో వ్యాక్సినేషన్ కొరత నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి మంత్రులు ఆళ్లనాని, అనిల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. దీనికి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు కౌంటర్ ఇచ్చారు. ఏసీబీ, సీఐడీని పంపించి, సంగం డైరీని స్వాధీనం చేసుకొని అమూల్‌కు అప్పజెప్పినట్లే భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్‌లను స్వాధీనం చేసుకొని, మన వాళ్లకు ఇవ్వడం కుదరదా? అని అయ్యన్న పాత్రుడు సూటిగా ప్రశ్నించారు. ఏసీబీ, సీఐడీలు కృష్ణా ఎల్లా, పూనావాలాను ఎత్తుకు రాలేరా? అని ప్రశ్నించారు. ఉత్తరం రాసినా వ్యాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూలు, కడప స్టేషన్లలో కేసులు పెట్టించి పట్టుకు రావచ్చు కదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చి వెళ్లరా? వాళ్లని అడుక్కోవడం ఏంటని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. 


మంత్రులు ఆళ్ల నాని, అనిల్ చంద్రబాబునుద్దేశించి ఏమన్నారంటే.....


ఆళ్ల నాని : ‘‘భారత్ బయోటెక్‌తో ఆయనకున్న బంధుత్వాన్ని ఉపయోగించి, రాష్ట్రానికి వ్యాక్సిన్‌ను తెప్పించినా మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు’’ అని నాని పేర్కొన్నారు.


అనిల్ కుమార్ : ‘‘రామోజీ వియ్యంకులు వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. చంద్రబాబు ముందుకు రావాలి. ముందుకు వచ్చి వ్యాక్సిన్లు ఇప్పిస్తే కొనుగోలుకు సిద్ధమే’’

Updated Date - 2021-05-13T01:12:00+05:30 IST