అనురాగ గీతం

ABN , First Publish Date - 2020-05-10T05:30:00+05:30 IST

బాలీవుడ్‌ యువ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ప్రపంచంలోని మాతృమూర్తుల కోసం ‘మా’ పేరిట ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘మదర్స్‌ డే’ సందర్భంగా...

అనురాగ గీతం

బాలీవుడ్‌ యువ హీరో ఆయుష్మాన్‌ ఖురానా ప్రపంచంలోని మాతృమూర్తుల కోసం ‘మా’ పేరిట ప్రత్యేక గీతాన్ని రూపొందించారు. ‘మదర్స్‌ డే’ సందర్భంగా ఆదివారం దాన్ని ఆలపిస్తున్నారు. 


‘‘పిల్లల కోసం అమ్మ చేసే త్యాగాలు... కురిపించే నిస్వార్థ ప్రేమలు నిరుపమానం. అలాంటి అమ్మకు ఒక రోజేంటి... ప్రతి రోజూ ఆమెదే! అయినప్పటికీ ఆమెకే ప్రత్యేకించిన ఈ రోజును మనందరం గొప్పగా జరుపుకోవాలి. అందుకే ‘మా’ పాటతో ఆమెకు వందనాలు సమర్పించనున్నాను’ అంటూ భావోద్వేగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘పిల్లలు బాధలో ఉంటే... ఏ తల్లి ఆనందంగా ఉండగలుగుతుంది? అమ్మ మోముపై చిరునవ్వులు పూయిద్దాం రండి’’ అంటూ పిలుపునిచ్చారు.

Updated Date - 2020-05-10T05:30:00+05:30 IST