Abn logo
Sep 23 2021 @ 18:25PM

ఏడాదిలో 100% ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి

న్యూఢిల్లీ: ఆయుష్మాన్ భారత్‌కు మూడేళ్లు పూర్తైన సందర్భంగా కేంద్ర వైద్య శాఖా మంత్రి మన్సుక్ మాండవీయ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికల్లా వంద శాతం ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా కేంద్రం ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలతో ఆరోగ్య బీమా కల్పిస్తోంది. ఇప్పటికే 16.5 కోట్ల కుటుంబాలకు ఆయుష్మాన్ కార్డుల పంపిణీ పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా 60 కోట్ల మందికి పైగా ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ 2.19 కోట్ల మంది పేద ప్రజలకు లబ్ది చేకూరింది. ఇప్పటికే 26,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు మోదీ ట్వీట్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్‌ అని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

ఇవి కూడా చదవండిImage Caption

జాతీయంమరిన్ని...