‘ఈ-సంజీవని’లో ఆయుష్‌ డాక్టర్ల సేవలు

ABN , First Publish Date - 2022-01-23T07:44:32+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ-సంజీవని ఓపీడీ పోర్టల్‌లో తొలిసారిగా ఆయుష్‌ డాక్టర్లను చేర్చింది. ఈ-సంజీవని వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలు తమ ప్రాంతం...

‘ఈ-సంజీవని’లో ఆయుష్‌ డాక్టర్ల సేవలు

న్యూఢిల్లీ, జనవరి 22: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ-సంజీవని ఓపీడీ పోర్టల్‌లో తొలిసారిగా ఆయుష్‌ డాక్టర్లను చేర్చింది. ఈ-సంజీవని వెబ్‌సైట్‌ ద్వారా ప్రజలు తమ ప్రాంతం నుంచి ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఇప్పుడు ఆయు ష్‌ డాక్టర్లను ఇందులో చేర్చడం ద్వారా ఆయుర్వేదం, హోమియోపతి, నేచురోపతి, యునాని, యోగా, సిద్ధ వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా అందనున్నా యి. ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్‌ ఈ పోర్టల్‌లో వైద్యులను చేర్చడంతోపాటు వారికి శిక్షణ ఇవ్వనుంది. 

Updated Date - 2022-01-23T07:44:32+05:30 IST