‘అయ్యో’ర్వేద వైద్యశాల

ABN , First Publish Date - 2021-10-18T04:41:43+05:30 IST

మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షం వస్తే చాలు చెరువులా మారుతోంది. స్లాబ్‌ పెచ్చులూడుతున్నాయి.

‘అయ్యో’ర్వేద వైద్యశాల
ఆయుర్వేద వైద్యశాల

వర్షానికి కురుస్తున్న స్లాబ్‌

పెచ్చులూడుతున్న తీరు

ఆందోళన చెందుతున్న రోగులు

పట్టించుకోని అధికారులు

నూతన భవన నిర్మాణమే సమస్యకు పరిష్కారం

కరకగూడెం, అక్టోబరు 17: మండల కేంద్రంలోని ఆయుర్వేద వైద్యశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షం వస్తే చాలు చెరువులా మారుతోంది. స్లాబ్‌ పెచ్చులూడుతున్నాయి. దీంతో వైద్యశాలకు వచ్చే రోగులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు పెచ్చులు రాలి మీద పడతాయోనని జంకుతున్నారు. గతంలో ఆయుర్వేద వైద్యశాల ఇప్పుడుతున్న తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండేది. జిల్లాలు మండలాలు విభజనలో భాగంగా నూతన కరకగూడెం మండలం ఏర్పడటంతో అధికారులు ఆయుర్వేద వైద్యశాలలో తహసీల్దార్‌ కార్యాయం ఏర్పాటు చేశారు. వైద్యశాల పరిసరాల్లో వైద్యశాల సిబ్బందికి నిర్మించిన భవనంలో ఆయుర్వేద వైద్యశాలను నియమించారు. ఆ భవనం శిథిలావస్థకు రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి త్వరగతి నూతన ఆయుర్వేద భవనం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-10-18T04:41:43+05:30 IST