Abn logo
Sep 23 2021 @ 08:58AM

దీపావళి వేళ.. ఆకాశంలో రామకథా గానం... వెలుగులు విరజిమ్మనున్న 500 డ్రోన్లు!

అయోధ్య: యూపీలోని అయోధ్యలో ఈసారి దీపావళి మరిన్ని హంగులను సంతరించుకోనుంది. యూపీ యోగి ఆదిత్యానాథ్ సర్కారు నవంబరు 3న తొలిసారిగా అయోధ్యలో 500 డ్రోన్లతో ‘ఏరియల్ డ్రోన్ షో’ నిర్వహించనుంది. ఇందుకోసం సర్కారు టెండర్‌ను కూడా పిలిచింది. అలాగే ఎయిర్ షో నిర్వహించే విషయమై కూడా చర్చలు జరుగుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో నిర్వహించిన మాదిరిగా ఎయిర్ షో ఉండాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నారని సమాచారం. శ్రీరాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరిగిన కథను డ్రోన్ షో ద్వారా చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఒక ఏజెన్సీని కూడా సంప్రదించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండిImage Caption