అయోధ్య చౌరస్తా.. ఆగమాగం

ABN , First Publish Date - 2022-07-03T05:20:14+05:30 IST

అయోధ్య చౌరస్తా.. ఆగమాగం

అయోధ్య చౌరస్తా.. ఆగమాగం


మేడ్చల్‌, జూలై 2: గుండ్లపోచంపల్లిలోని అయోధ్య చౌరస్తా వద్ద రోడ్డు పూర్తిగా పాడైంది. చిన్న వర్షానికే రోడ్డంతా నీరు నిండి కుంటను తలపిస్తోంది. ఈ రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి వాహనాలు రోడ్డు గుంతలో ఆగిపోతున్నాయి. వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసమై ఏళ్లవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పట్టణ ప్రగతిలోనూ ఈ రోడ్డు మరమ్మతుల గురించి పట్టించుకోలేదని స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-07-03T05:20:14+05:30 IST