* రూ. 2.33 లక్షల కోట్లకు పెరిగిన మార్కెట్ క్యాప్
ముంబై : సిటీ బ్యాంక్ భారత్ వ్యాపారం కొనుగోలుతో యాక్సిస్ బ్యాంక్ స్టాక్ 2 % పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ స్టాక్ బీఎస్ఈలో 1.82 % లాభపడి, రూ. 763.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 2.33 లక్షల కోట్లకు పెరిగింది. యాక్సిస్ బ్యాంక్ స్టాక్ 5 రోజులు, 20/50/100/200 రోజుల సగటు కంటే ఎక్కువగా ట్రేడవుతోంది. భారత్ లోని సిటీ గ్రూప్ రిటైల్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రైవేటురంగ రుణదాత కొనుగోలు చేసిన నేపథ్యంలో... యాక్సిస్ బ్యాంక్ షేర్లు ఈరోజు(గురువారం) దాదాపు 2 శాతం పెరిగాయి. సంస్థకు సంబంధించిన మొత్తం 2.47 లక్షల షేర్లు బీఎస్ఈలో రూ. 18.68 కోట్ల టర్నోవర్‌గా మారాయి.
యాక్సిస్ బ్యాంక్ స్టాక్ ఒక సంవత్సరంలో 9 శాతం లాభపడిడమే కాకుండా, ఈ సంవత్సరం ప్రారంభం నుండి 12.05 శాతం పెరిగింది. కాగా... 2.5 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 18 వేల కోట్లు) విలువ చేసే ఈ డీల్ రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉంటుంది. ఇక మరింత విశ్లేషణకు వెళితే... సిటీ బ్యాంక్‌కు సంబంధఇంచిన వినియోగదారు బిజ్ను కొనుగోలు చేయడం ద్వారా యాక్సిస్ బ్యాంక్ ఎలా లాభపడుతుందంటే... నిరుడు ఏప్రిల్‌లో అమెరికన్ బ్యాంకింగ్ మేజర్ సిటీ గ్రూప్ తన ప్రపంచ వ్యూహంలో భాగంగా భారత్‌లోని వినియోగదారు బ్యాంకింగ్ వ్యాపారం నుండి నిష్క్రమించే ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే.
వ్యాపారంలో క్రెడిట్ కార్డ్‌లు, రిటైల్ బ్యాంకింగ్, గృహ రుణాలు, సంపద నిర్వహణ ఉంటాయి. బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 35 శాఖలున్నాయి. వినియోగదారుల బ్యాంకింగ్ వ్యాపారంలో సుమారు 4 వేల మంది ఉద్యోగులున్నారు. ఒప్పందానికి అనుమతులు లభించిన తర్వాత... యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ పరిమాణం విస్తరించనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా... రిటైల్ సెగ్మెంట్ గణనీయమైన జంప్‌ను చూస్తుందని తెలిపాయి. సిటీ గ్రూప్ 1902 లో భారత్‌లోకి ప్రవేశించింది. కాగా... 1985 లో వినియోగదారుల బ్యాంకింగ్ వ్యాపారాన్ని ప్రారంభించింది.
ఇవి కూడా చదవండి