రూ.12,325 కోట్లకు కొనుగోలు
న్యూఢిల్లీ: అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌నకు చెందిన భారత కన్జ్యూమర్ బ్యాంకింగ్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంక్ రూ.12,325 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా సిటీ గ్రూప్ మన దేశంలో నిర్వహిస్తున్న రిటైల్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, వెల్త్‌మేనేజ్‌మెంట్, కన్జ్యూమర్ లోన్ వ్యాపార కార్యకలాపాలు యాక్సి స్ బ్యాంక్ పరంకానున్నాయి. సిటీ బ్యాంక్‌లో పనిచేస్తున్న 3,600 మంది ఉద్యోగులు సైతం యాక్సిస్ బ్యాంక్ కు బదిలీ కానున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధం చివరికల్లా డీల్ పూర్తికావచ్చని అంచనా.
వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా భారత్ సహా 13 మార్కెట్లలో రిటైల్ కార్యకలాపాల నుంచి తప్పుకుంటున్నట్లు సిటీ గ్రూప్ గతంలోనే ప్రకటించింది. అందులో భాగంగానే భారత రిటైల్ కార్యకలాపాలను యాక్సిస్ బ్యాంక్‌కు విక్రయించింది. అయితే, భారత్‌లో ఇన్స్టిట్యూషనల్ క్లయింట్ బిజినె్‌సను మాత్రం యధావిధిగా కొనసాగించనున్నట్లు సిటీ గ్రూప్ స్పష్టం చేసింది.
యాక్సి్‌సకు లాభమే..
దేశంలో క్రెడిట్ కార్డుల జారీ విషయంలో యాక్సిస్ బ్యాంక్ నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటివరకు బ్యాంక్ 86 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేసింది. సిటి గ్రూప్ ఆస్తుల కొనుగోలుతో మరో 26 లక్షల క్రెడిట్ కార్డుదారులు యాక్సిస్ పరిధిలోకి రానున్నారు. తద్వారా యాక్సి స్ బ్యాంక్ ఈ విభాగంలో మూడో అతిపెద్ద సంస్థగా అవతరించనుంది. అంతేకాదు, సిటీబ్యాంక్ ఇండియాకు చెందిన 30 లక్షల మంది కస్టమర్లు, 7 కార్యాలయాలు, 21 బ్రాంచ్‌లు, 18 నగరాల్లోని 499 ఏటీఎంలు యాక్సిస్ బ్యాంక్‌కు బదిలీ కానున్నాయి.
సిటీ బ్యాంక్ ఇండియా రిటైల్ బుక్ విలువ రూ.68,000 కోట్లు. అందులో రిటైల్ రుణాల విలువ రూ.28,000 కోట్లు. దేశీయంగా 12 లక్షల బ్యాంకింగ్ ఖాతాలు కలిగిన సిటీబ్యాంక్ ఇండి యా.. మాతృసంస్థ మొత్తం లాభాల్లో 1.5 శాతం వరకు సమకూరుస్తోంది. కాగా, యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత రిటైల్ బుక్ విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లుగా ఉంది. సిటీ బ్యాంక్‌కు చెందిన ధనిక కస్టమర్లు కూడా జతయ్యాక యాక్సిస్ రిటైల్ బుక్ విలువ మరింత పెరగనుంది. సిటీ ఆస్తుల కొనుగోలు పూర్తయ్యాక యాక్సిస్ బ్యాంక్ 2.85 కోట్ల సేవింగ్స్ అకౌంట్లు, 2.3 లక్షలకు పైగా బర్గండీ కస్టమర్లు, 1.06 కోట్ల క్రెడిట్ కార్డ్ కస్టమర్లను కలిగి ఉండనుంది.
1902లో సిటీ భారత్ ఎంట్రీ
భారత్‌లోకి 1902 సంవత్సరంలో ప్రవేశించిన సిటీ గ్రూప్.. 1985లో కన్జ్యూమర్ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ విభాగం నుంచి తప్పుకుంటున్న సిటీబ్యాంక్ ఇకపై ఇన్స్టిట్యూషనల్ బ్యాంకింగ్‌తోపాటు ఆఫ్‌షోర్, గ్లోబల్ బిజినెస్ సపోర్ట్‌పై దృష్టిసారించనున్నట్లు తెలిపింది. ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లోని కేంద్రాల ద్వారా బ్యాంక్ ఈ సేవలను అందించనుంది.