టెస్టు క్రికెట్ చరిత్రలో అక్షర్ సరికొత్త రికార్డు !

ABN , First Publish Date - 2021-02-26T01:46:33+05:30 IST

మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో అక్షర్ సరికొత్త రికార్డు !

అహ్మదాబాద్: మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన పింక్‌బాల్ టెస్టులో భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. డే-నైట్ టెస్టు మ్యాచ్‌లో 11 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 70 పరుగులిచ్చిన అక్షర్.. 11 వికెట్లు తీయడం విశేషం. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అక్షర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో డే-నైట్ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇంతకుముందు ఈ రికార్డు 10 వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమీన్స్ పేరిట ఉంది. అలాగే ఇదే మ్యాచులో అక్షర్ పేరిట మరో రెండు రికార్డులు కూడా నమోదయ్యాయి. డే-నైట్ టెస్టులో వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో 5 వికెట్లు తీసిన ఎకైక బౌలర్ కూడా అక్షరే. అంతేగాక ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు వికెట్ల మార్క్‌ను అందుకున్న మూడో భారత బౌలర్ అక్షర్. ఇంతకుముందు 1984లో లక్ష్మణ్ శివరామక్రిష్ణన్, 2016లో రవిచంద్రన్ అశ్విన్ ఈ ఫీట్ సాధించారు.    


Updated Date - 2021-02-26T01:46:33+05:30 IST