రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-11-01T07:59:24+05:30 IST

మంచిర్యాల మున్సిపాలిటీలో శనివారం జరిగిన సాధారణ సమావేశం రసాభాసగా ముగిసింది. పాలకవర్గం, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో సభ దద్ధరిల్లింది.

రసాభాసగా మున్సిపల్‌ సమావేశం

అవినీతిపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్ష కౌన్సిలర్లు ఫ ఎజెండా ప్రకారమే ముందుకు సాగుతామన్న పాలకవర్గం

కార్యాలయం ఎదుట ఫ్లకార్డులతో కాంగ్రెస్‌ సభ్యుల నిరసన  కలకలం సృష్టించిన ఆంధ్రజ్యోతి కథనం


మంచిర్యాల, అక్టోబరు 31: మంచిర్యాల మున్సిపాలిటీలో శనివారం జరిగిన సాధారణ సమావేశం రసాభాసగా ముగిసింది. పాలకవర్గం, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలతో సభ దద్ధరిల్లింది. పాలకవర్గం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు నిలదీశారు. మున్సిపాలిటీ పరిధిలో మొ త్తం 21 పనులకుగాను రూ.42 లక్షల అంచనా వ్యయంతో ఎజెండా రూపొందిం చగా చైర్మన్‌ పెంట రాజయ్య అధ్యక్షతన సమావేశాన్ని ప్రారంభించారు. మున్సిప ల్‌ అసిస్టెంట్‌ ఇంజనీరు నరసింహస్వామి ఎజెండా చదువుతుండగా కాంగ్రెస్‌ సభ్యులు అవినీతిపై మొదట చర్చ జరగాలని పట్టుబట్టారు. మున్సిపాలిటీ ఆధ్వ ర్యంలో ఇటీవల కొనుగోలు చేసిన స్వచ్ఛ ఆటోల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిం దని, అందులో కమీషన్లను చైర్మన్‌ సభ్యులకు తలా రూ.25 వేలు పంచారని కాం గ్రెస్‌ సభ్యులు ఆరోపిస్తూ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో పాలకవర్గ సభ్యులు కల్పించుకొని ఎజెండా ప్రకారమే సభ సాగుతుందని, ఇతర అంశాలపై ప్రస్తావన ఉండదని చెప్పడంతో కాంగ్రెస్‌ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మున్సిపాలిటీని అవినీతిమయంగా మార్చుతున్నారని ఆరోపిస్తూ సమావేశాన్ని బహిష్కరించారు. వైస్‌చైర్మన్‌ గాజుల ముకేష్‌గౌడ్‌, కమిషనర్‌ స్వరూపారాణి, ఫ్లోర్‌లీడర్‌ ఉప్పలయ్య, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్లు వేములపల్లి సంజీవ్‌, అబ్దుల్‌ మాజిద్‌,  కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. 


ప్రతిపక్ష సభ్యుల గొంతునొక్కే యత్నం....కాంగ్రెస్‌

ప్రతిపక్ష సభ్యుల గొంతునొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫ్లోర్‌ లీడర్‌ రావుల ఉప్పలయ్య ఆరోపించారు. సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం కార్యాలయం ఎదుట కాంగ్రెస్‌ సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఆటోల కొనుగోళ్లలో అవినీతిని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చిందని, దీని పై పట్టణంలో చర్చ జరుగుతుండగా సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. అవినీతిపై మాట్లాడనివ్వలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అడిగిన ప్రశ్నలకు సమా ధానం ఇవ్వకుండా డొంకతిరుగుడు సమాధానాలు ఇచ్చారని మండిపడ్డారు. ని బంధనలకు విరుద్ధంగా డీలర్‌తో లాలూచీపడి టెండర్లు పిలవకుండానే రూ.1.34 కోట్లతో ఆటోలు కొనుగోలు చేశారని, అందుకు ప్రతిఫలంగా రూ.20 లక్షల మేర కమీషన్లు పొందారని ఆరోపించారు. కమీషన్ల సొమ్ములో చైర్మన్‌ వాటా ఎంత ఉందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సాంకేతిక మంజూరు, ఈ టెండర్లు ఎందుకు నిర్వహించలేదో వివరణ ఇవ్వాలని అన్నారు. లేనిపక్షంలో పాలక వర్గం అవినీతిపై మున్సిపల్‌ పరిపాలనశాఖతోపాటు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయను న్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన కాంగ్రెస్‌ సభ్యులు, అవినీతిపై కార్యాలయ ఏవోకు ఫిర్యాదు చేశారు. 


ఎజెండాపై చర్చ జరగాలన్నాం....పాలక వర్గం

సాధారణ సమావేశంలో ఎజెండా ముఖ్యవిషయాలు పూర్తయ్యాక మిగతావి చర్చించాలని సూచించినా ప్రతిపక్ష సభ్యులు వినకుండా బహిష్కరించి వెళ్లిపో యారని చైర్మన్‌ పెంట రాజయ్య విలేకర్లకు తెలిపారు. ఎజెండా అంశాలు, చేపట్ట బోయే అభివృద్ధి పనుల గురించి వివరించారు. ప్రతిపక్ష సభ్యులు పదేపదే కుం భకోణం అనడం బాధాకరమన్నారు. అవినీతిని నిరూపిస్తే పదవి నుంచి తప్పు కుంటానని చెప్పడం జరిగిందన్నారు. ఆధారాలతో చూపమన్నామని, ప్రజలను త ప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని ఆరోపించారు. దిగజార్చే విధంగా మాట్లా డటం సరికాదని, మంచికోసం సూచనలిస్తే తప్పకుండా స్వీకరిస్తామని తెలిపారు. 

Updated Date - 2020-11-01T07:59:24+05:30 IST