బాలల రక్షణపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-12T06:11:02+05:30 IST

వాంబేకాలనీ హెచ్‌ బ్లాక్‌ వద్ద గల కమ్యూనిటీ హాల్‌లో గురువారం ఆపదలో ఉన్న బాలల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.

బాలల రక్షణపై అవగాహన కల్పించాలి
పోస్టర్లను ప్రదర్శిస్తున్న పోలీసు సిబ్బంది

బాలల రక్షణపై అవగాహన కల్పించాలి

క్రైమ్‌ ఏడీసీపీ  వెంకటరత్నం

పాయకాపురం, ఆగస్టు 11 : వాంబేకాలనీ హెచ్‌ బ్లాక్‌ వద్ద గల కమ్యూనిటీ హాల్‌లో గురువారం ఆపదలో ఉన్న బాలల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా క్రైమ్‌ ఏడీసీపీ పి. వెంకటరత్నం మాట్లాడుతూ అరవండి, పరుగెత్తండి, చెప్పండి,(షౌట్‌, రన్‌, టెల్‌) నినాదాలతో ఇంగ్లీష్‌, తెలుగు బాషలలో ప్రచార పోస్టర్లను, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ మధ్య వ్యత్యాసంపై 8 నిముషాలతో వీడియో క్లిప్‌ రూపొందించడం జరిగిందని తెలిపారు. చైల్డ్‌లైన్‌ 1098, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, పోలీసు 100 హెల్ప్‌లైన్‌ నెంబర్లపై ప్రతి ఒక్కరికి  అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ముద్రించినట్లు తెలిపారు. దిశ ఏసీపీ నాయుడు, సీడబ్ల్యూసీ మెంబరు కృష్ణకుమారి, వాసవ్య మహిళా మండలి సభ్యురాలు విజయ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T06:11:02+05:30 IST