అవగాహన కల్పిస్తున్న శేఖర్‌బాబు
బాలల పరిరక్షణపై అవగాహన
పటమట, మే 23 : నవ జీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో విజయవాడ పటమట రైతు బజారులో ముఠా సభ్యులకు బాలల పరిరక్షణపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రోగ్రాం మేనేజర్ గోళ్లమూడి శేఖర్‌బాబు మాట్లాడు తూ బాలలకు తోడుగా ఉందాం అని, అప్పుడే ధైర్యంతో ముందుకు సాగుతారని తెలిపారు. మానసిక సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు, యువతకు పెజ్జోనిపేటలోని నీతోడు మానసిక వికాస కేంద్రాన్ని డాన్ బాస్కో నవజీవన బాలభవన్ ఏర్పాటు చేసిందని, క్లినికల్ సైకాలజిస్టులతో సమస్యకు పరిష్కారం చూపుతారని తెలిపారు. వివరాలకు 9490492020 నెంబర్‌కు ఉచితంగా సంప్రదించ వచ్చునని తెలిపారు. నవజీవన బాలభవన్ జోనల్ కో-ఆర్డినేటర్ బి.రమేష్, జె.ఆంజనేయులు, ముఠా మేస్త్రి సింహాచలం, ముఠా సభ్యులు పాల్గొన్నారు.