జీవో 1 పై అవగాహన

ABN , First Publish Date - 2022-01-15T06:04:33+05:30 IST

మహిళా పోలీసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 పై శుక్రవారం పోలీసు స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు,

జీవో 1 పై అవగాహన

జీవో 1 పై అవగాహన 

వన్‌టౌన్‌, జనవరి 14: మహిళా పోలీసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1 పై శుక్రవారం పోలీసు స్టేషన్లలో అవగాహన కార్యక్రమాలను  నిర్వహించారు, వన్‌టౌన్‌, భవానీపురం, సూర్యారావుపేట, కృష్ణలంక స్టేషన్లలో సీఐలు, ఎస్‌ఐలు కలిసి మహిళా పోలీసుల విధి విధానాలను వివరించారు. కొత్తగా జారీ అయిన జీవో 1 ద్వారా పదోన్నతులు, ఉద్యోగ భద్రత కల్పించిన నేపథ్యంలో మహిళా పోలీసులు మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. సీఎం, డీజీపీ, సీపీలకు థ్యాంక్యూ చెబుతూ ప్లకార్లును ప్రదర్శించారు. వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు, భవానీపురం ఇన్‌ఛార్జి సీఐ ఎన్‌ శ్రీనివాసు, సూర్యారావుపేట సీఐ వి. జానకి రామయ్య, కృష్ఱలంక సీఐ సత్యానందం వారి వారి స్టేషన్లలో ఎస్‌ఐల సహకారంతో కార్యక్రమాలను నిర్వహించారు. సూర్యారావుపేట సీఐ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.

Updated Date - 2022-01-15T06:04:33+05:30 IST