బాలల రక్షణపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-19T06:07:39+05:30 IST

బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు ఆపదలో ఉన్న బాలల రక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని క్రైం ఏడీసీపీ పి. వెంకటరత్నం అన్నారు.

బాలల రక్షణపై అవగాహన కల్పించాలి
అవగాహన పోస్టర్లను ప్రదర్శిస్తున్న పోలీసు సిబ్బంది

బాలల రక్షణపై అవగాహన కల్పించాలి

 క్రైం ఏడీసీపీ పి. వెంకటరత్నం

పాయకాపురం, ఆగస్టు 18: బాలలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు ఆపదలో ఉన్న బాలల రక్షణపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని క్రైం ఏడీసీపీ పి. వెంకటరత్నం అన్నారు. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసు  స్టేషన్‌ పరిధిలోని న్యూ రాజరాజేశ్వరి పేటలో గురువారం ఆపదలో ఉన్న బాలల రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరవండి, పరుగెత్తండి, చెప్పం డి(షౌట్‌, రన్‌, టెల్‌) నినాదాలతో ఇంగ్లీష్‌, తెలుగు భాషల్లో ఆపదలో ఉన్న పిల్లలకు తెలిసే విధంగా ప్రచార పోస్టర్లను, గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ మధ్య వ్యత్యాసంపై 8 నిముషాలతో వీడియో క్లిప్‌ రూపొందించినట్లు తెలిపారు. చైల్డ్‌లైన్‌ 1098, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, పోలీసు 100 హెల్ప్‌లైన్‌ నెంబర్లపై ప్రతి ఒక్కరికి  అవగాహన కల్పించేందుకు పోస్టర్లను ముద్రించడం జరిగిందని తెలియజేశారు. దిశ ఏసీపీ నాయుడు, నార్త్‌జోన్‌  ఏసీపీ రమణమూర్తి, సీఐ లక్ష్మీనారాయణ, సీడబ్ల్యూసీ మెం బరు కృష్ణకుమారి, వాసవ్య మహిళా మండలి సభ్యురాలు విజయ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T06:07:39+05:30 IST