Abn logo
Sep 25 2021 @ 00:00AM

అవే నా బ్యూటీ సీక్రెట్స్‌!

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనె ఇటీవలే బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పి.వి.సింధుతో కలిసి గేమ్‌ ఆడింది. ‘దీపికా మళ్లీ వస్తే పతకాలే’నంటూ సింధు కొనియాడింది. స్పోర్ట్స్‌ కల్చర్‌నుంచి వచ్చిన దీపికా యాక్టింగ్‌ స్కిల్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బ్యూటిఫుల్‌ లుక్స్‌కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఇంతకీ ఆమె బ్యూటీ సీక్రెట్స్‌ ఏంటో తెల్సుకుందాం. 


‘‘కచ్చితమైన డైట్‌, ఉదయాన్నే వర్కవుట్స్‌ చేయకుండా ఉండలేను. ఎక్కడికెళ్లినా మంచి నీళ్లు కాస్త ఎక్కువగా తాగడానికే ఆసక్తి చూపిస్తాను. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లకు అధిక ప్రాధాన్యత ఇస్తా. 


ఎక్కువగా స్పాలకి వెళ్లటం అంటే ఇష్టం. ఎంత బిజీగా ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా మసాజ్‌ చేయించుకుంటే ఉపశమనం లభిస్తుంది. రెగ్యులర్‌గా స్పాలకు వెళ్లే నేను మసాజ్‌తో పాటు స్టీమ్‌బాత్‌లూ చేయించుకుంటా. స్కిన్‌ కేర్‌ విషయంలో నిక్కచ్చిగా ఉంటా. సన్‌స్ర్కీన్‌ లోషన్స్‌ రాసుకుంటా. ముఖ్యంగా ‘క్లే మాస్క్‌’లు కూడా ఉపయోగిస్తుంటా. దీంతో ముఖంపై మృతకణాలు పోయి చర్మం ఫ్రెష్‌గా, ఆరోగ్యంగా ఉంటుంది. 


ఒకప్పుడు తీవ్ర ఒత్తిడితో మానసికంగా కుంగిపోయేదాన్ని. కొన్నిరోజులు మానసిక వ్యాధితో బాధపడ్డా. ఆ ఫేజ్‌నుంచి బయటికొచ్చా. నా భర్త రణ్‌వీర్‌ సింగ్‌ ఫన్నీ పర్సన్‌. సీరియస్‌గా ఉండకుండా.. హాయిగా కామిక్స్‌ ప్రోగ్రామ్స్‌ చూడటం అలవాటు. ఇబ్బందికరమైన సమస్యలొచ్చినప్పుడు హాస్యకోణంలో చూస్తాను. ఆనందంగా ఉండటం.. ప్రశాంతమైన నిద్ర.. రెగ్యులర్‌గా చేసే వ్యాయామాలే నా బ్యూటీ సీక్రెట్స్‌.