ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

ABN , First Publish Date - 2021-12-02T05:44:09+05:30 IST

ఎయిడ్స్‌ రహిత సమాజం మన అందరి బాధ్యత అని మేయర్‌ బీవై రామయ్య, డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య అన్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న మేయర్‌, డీఎంహెచ్‌వో

కర్నూలు(హాస్పిటల్‌), డిసెంబరు 1: ఎయిడ్స్‌ రహిత సమాజం మన అందరి బాధ్యత అని మేయర్‌ బీవై రామయ్య, డీఎంహెచ్‌వో డా.బి.రామగిడ్డయ్య అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని బుధవారం వారు ప్రారంభించారు. అందరి భాగస్వామ్యంతోనే ఎయిడ్స్‌ వ్యాధి నివారణ సాధ్యమని అన్నారు. హెచ్‌ఐవీ సోకిందంటే ఆత్మహత్యకు పాల్పడే రోజుల నుంచి స్వయంగా అవగాహన పెంచుకునే స్థాయికి చేరుకున్నామని అన్నారు. ప్రస్తుతం ఎయిడ్స్‌ 0.04 శాతం ఉందని, దీన్ని సున్నాకు చేరేలా కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్‌ అండ్‌ లెఫ్రసీ ఇన్‌చార్జి అడిషినల్‌ డీఎంహెచ్‌వో డా.దేవసాగర్‌, జిల్లా యువజన సంక్షేమ అధికారి నాగరాజనాయుడు, జిల్లా మేనేజర్‌ అలిహైదర్‌, హెచ్‌ఈవో శివశంకర్‌ రావు, విక్టర్‌ మనోహర్‌, జిల్లా పాజిటివ్‌ నెట్‌వర్క్‌ అధ్యక్షురాలు సుధారాణి, ఏపీశాక్స్‌ పార్టనర్స్‌ నర్సింగ్‌ విద్యార్థులు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-02T05:44:09+05:30 IST