మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2021-10-27T06:23:52+05:30 IST

మహిళా రక్షణ చట్టాలపై ఎద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి వరుధిని సూచించారు.

మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలి
సఖి కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని

- సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని

పెద్దపల్లిటౌన్‌, అక్టోబరు 26: మహిళా రక్షణ చట్టాలపై ఎద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి వరుధిని సూచించారు. అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మంగళవారం సఖి కేంద్రాన్ని పరిశీలించి నిర్వాహ ణ విధానాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావే శంలో జడ్జి వరూధిని మాట్లాడారు. మహిళ హెల్ప్‌ లైన్‌ 181, 1098 ఫోన్‌ నంబర్ల పై విసృత ప్రచారం చేయాలన్నారు. ఆర్థిక స్థితిగతులకు సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాలకు న్యాయం అందించేందకు కృషి చేస్తున్నామన్నారు. వర కట్న వేధింపులు, మహిళల అక్రమ రవాణా, పనులు చేస్తున్న చోట వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు. ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు సఖి కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 సైబర్‌ నేరాలు, 5 వరకట్న వేధింపులు, 422 గృహి హింస కేసులు, 3 మెంటల్‌ స్ర్టెస్‌ కేసులు, 26 మిస్సింగ్‌ కేసులు, 5 లైంగిక వేధింపులు, 5 పొక్సో, 6 బాల్యవివాహాలు, 45 ఇతరత్రా కేసులతో కలిపి మొత్తం 527 కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కార్య క్రమంలో రౌఫ్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T06:23:52+05:30 IST